కుమార్తె పెళ్లిలో స్టెప్పులేసిన కేంద్రమంత్రి..!

Union Minister Pralhad Joshi dances with his wife at daughter's wedding. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తన కుమార్తె

By అంజి  Published on  3 Sept 2021 12:21 PM IST
కుమార్తె పెళ్లిలో స్టెప్పులేసిన కేంద్రమంత్రి..!

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తన కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నెల 2వ తేదీన ప్రహ్లాద్ జోషి కుమార్తె వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తన భార్యతో కలిసి కన్నడ పాటకు జోరుగా స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఆయన డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


కర్ణాటకలోని హుబ్లీ నగరంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు కేంద్రమంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


Next Story