ఇండిగో విమానంలో తనతో పాటు ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంంతో.. అతడికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాద్ ప్రథమ చికిత్స ప్రాణాలు రక్షించారు. సోమవారం రాత్రి ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లే విమానం టేకాఫ్ అయ్యింది. టేకాఫ్ అయిన కాసేపటితో విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు కళ్లు తిరిగి స్పృహతప్పి పడిపోయాడు. అదే విమానంలో ఉన్న కేంద్రమంత్రి కరాద్ వృత్తి రీత్యా డాక్టర్. దీంతో విమానంలోని ఎమర్జెన్సీ కిట్ నుండి రోగికి ఇంజెక్షన్ చేశాడు. రోగికి బీపీ తక్కువగా ఉందని కరాద్ చెప్పడంతో అతని షర్ట్ తొలగించి ఛాతీ వద్ద మసాజ్ చేశారు. 30 నిమిషాల తర్వాత ప్రయాణికుడి పరిస్థితి కాస్తా మెరుగుపడింది. ఆ తర్వాత అతను తన పాదాలను పైకి లేపమని, ప్రతి నిమిషం తన స్థానాన్ని మార్చమని అడగడం ద్వారా రోగి యొక్క అసౌకర్యాన్ని తగ్గించాడు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ కేంద్ర మంత్రి సహాయానికి తమ అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఇండిగో విమానయాన సంస్థ ట్వీట్ చేస్తూ.. కేంద్రమంత్రి కరాద్ తన విధులను నాన్‌స్టాప్‌గా నిర్వర్తించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొంది. డాక్టర్ భగవత్ కరాద్ తోటి ప్రయాణీకుడికి సహాయం చేయడంలో మీ స్వచ్ఛంద మద్దతు ఎల్లప్పుడూ చాలా స్ఫూర్తిదాయకం అని తెలిపింది. డాక్టర్ భగవత్ కరద్ 2021 జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా చేరారు. అతను మహారాష్ట్ర నుండి పార్లమెంటుకు రాజ్యసభ సభ్యుడు.