కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు

By Medi Samrat  Published on  15 May 2024 7:30 AM GMT
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె ఉదయం 9:28 గంటలకు మరణించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె తన చివరి రోజుల్లో వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆమె గత మూడు నెలలుగా ప్రీమియర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె సెప్సిస్‌తో పాటు న్యుమోనియాతో పోరాడుతోంది.

మాధవి రాజే గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆమె గత మూడు నెలల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వార్తా సంస్థ PTI నివేదించిన ప్రకారం.. ఆమె సెప్సిస్‌తో పాటు న్యుమోనియాతో బాధపడుతూ ఉన్నారు. మాధవి రాజే మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story