ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సు..నేడు ప్రారంభించనున్న అమిత్ షా

ఉగ్రవాద వ్యతిరేక సదస్సు (Anti-Terror Conference)’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్నారు.

By -  Knakam Karthik
Published on : 26 Dec 2025 7:47 AM IST

National News, Delhi, Central Government, Anti Terror Conference, Union Home Minister Amit Shah

ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సు..నేడు ప్రారంభించనున్న అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ దృక్పథానికి అనుగుణంగా నిర్వహిస్తున్న ‘ఉగ్రవాద వ్యతిరేక సదస్సు (Anti-Terror Conference)’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ రెండురోజుల సదస్సును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ వార్షిక సదస్సు ఉగ్రవాదం నుంచి ఉద్భవిస్తున్న కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ అనుసరించాల్సిన నూతన తరం వ్యూహాలపై చర్చించేందుకు ఒక ముఖ్యమైన వేదికగా మారింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో పాల్గొనే ఆపరేషన్ బలగాలు, సాంకేతిక, న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు మరియు వివిధ సంస్థలు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

సదస్సులో ప్రధానంగా ‘హోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్రోచ్’ స్ఫూర్తితో వివిధ స్టేక్‌హోల్డర్ల మధ్య సమన్వయం పెంపొందించడం, సమిష్టి చర్యలకు అధికారిక–అనధికారిక మార్గాలను ఏర్పాటు చేయడం, భవిష్యత్ విధానాల రూపకల్పనకు అవసరమైన సూచనలను అందించడం పై దృష్టి సారించనున్నారు.

రెండురోజుల పాటు జరిగే చర్చల్లో ఉగ్రవాద నిరోధక (CT) దర్యాప్తులలో చట్ట అమలు సంస్థలు ఎదుర్కొన్న అనుభవాలు, ఉత్తమ ఆచరణలు, కేసుల నుంచి నేర్చుకున్న పాఠాలను పంచుకోనున్నారు. విదేశీ న్యాయ పరిధుల్లో ఆధారాల సేకరణ, డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా విశ్లేషణ, సమర్థవంతమైన ట్రయల్ మేనేజ్‌మెంట్, రాడికలైజేషన్‌ నివారణ, గూఢచర్యం (ఎస్పియనేజ్), హైబ్రిడ్ ముప్పులు వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.

అలాగే, ఉగ్రవాద ఆర్థిక వనరులను అడ్డుకోవడం, టూల్స్–టెక్నిక్స్, కేస్ లెర్నింగ్స్, భవిష్యత్‌కు సిద్ధమైన ఉగ్రవాద నిరోధక వ్యూహాల రూపకల్పన, సంస్థాగత సామర్థ్యాల పెంపు వంటి అంశాలు కూడా సదస్సులో ప్రాధాన్యత పొందనున్నాయి. ఈ సదస్సులో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ పోలీసు అధికారులు, కేంద్ర సంస్థల అధికారులు, అలాగే న్యాయం, ఫోరెన్సిక్స్, టెక్నాలజీ రంగాల నిపుణులు పాల్గొననున్నారు.

Next Story