ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌లో భారతదేశం ఒకటి. పెరుగుతున్న విమాన ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి రాబోయే సంవత్సరాల్లో భారతదేశానికి కనీసం 20,000 మంది పైలట్లు అవసరమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. పైలట్‌ల కోసం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ (ఇపిఎల్) ప్రారంభించిన అనంతరం UDAAN భవన్‌లో జరిగిన సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతికి విమానయానం ఎల్లప్పుడూ వెన్నెముక అని అన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో మరో 50 విమానాశ్రయాలు ఉంటాయన్నారు. గత పదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగి 157కి చేరుకుందన్నారు. రాబోయే రోజుల్లో కనీసం 20,000 మంది పైలట్ల అవసరం ఉంటుందని రామ్మోహన్ నాయుడు అన్నారు.
పౌర విమానయాన శాఖ సాంకేతికతను పెద్ద ఎత్తున ఉపయోగిస్తోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. “EPL ప్రారంభంతో, పైలట్‌లు ఇప్పుడు వారి లైసెన్సులను మరింత సులభంగా యాక్సెస్ చేయగలరు. భారత ప్రభుత్వ మిషన్ ఆఫ్ డిజిటల్ ఇండియాతో జతకట్టింది, పౌరులు, పరిశ్రమల ప్రయోజనం కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడంపై మా అంకితభావాన్ని బలోపేతం చేస్తుంది, ”అని ఆయన అన్నారు.