ఉదయపూర్ హంతకుడికి ఆ సంస్థ‌ల‌తో లింకులు..?

Udaipur killer Riyaz Attari had joined SDPI in 2019. అమరావతి-ఉదయపూర్ లో ఇస్లామిస్టులు ISIS తరహాలో చేసిన హత్యలపై విచారణ

By Medi Samrat
Published on : 10 July 2022 6:05 PM IST

ఉదయపూర్ హంతకుడికి ఆ సంస్థ‌ల‌తో లింకులు..?

]అమరావతి-ఉదయపూర్ లో ఇస్లామిస్టులు ISIS తరహాలో చేసిన హత్యలపై విచారణ నిర్వహిస్తూ ఉన్నారు. నిందితులకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి రాజకీయ ఫ్రంట్ అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)తో సంబంధాలు కలిగి ఉన్నాయని తెలిపారు. అమరావతిలో ఫార్మసిస్ట్ ఉమేష్ కోల్హేను చంపేయగా.. ఉదయ్ పూర్ లో టైలర్ కన్హియా లాల్ లను అతి దారుణంగా హత్య చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (NIA) శుక్రవారం సాయంత్రం కన్హియా లాల్ హత్యలో ఫర్హాద్ మహ్మద్ షేక్ అకా బబ్లాను ఏడవ నిందితుడిగా అరెస్టు చేశారు. PFI ద్వారా జూన్ 20 న నూపుర్ శర్మకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ తరువాత ఉదయపూర్ కుట్ర పన్నినట్లు స్పష్టంగా తెలుస్తుంది.

ఉదయ్‌పూర్‌ హత్యలో ఆయుధాలను సరఫరా చేసిన ప్రధాన నిందితుడు రియాజ్ అత్తర్ 2019లో SDPIలో చేరి క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడని నిర్ధారించబడింది. నిందితుడు బబ్లా తన విచారణలో తన PFI-SDPI సంబంధాలు ఉన్నాయని కూడా అంగీకరించాడు. సీఎఫ్‌ఎస్‌ఎల్ సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించి నివేదిక పంపిన తర్వాతే ఉదయ్‌పూర్, అమరావతి నిందితుల అంతర్జాతీయ సంబంధాలు బయటపడతాయని, అమరావతి హత్యకేసులో పీఎఫ్‌ఐ-ఎస్‌డీపీఐ లింకు కూడా స్పష్టంగా కనిపిస్తోందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. PFI-SDPI తమను తాము సామాజిక-రాజకీయ సంస్థలుగా అభివర్ణించుకున్నప్పటికీ.. తీవ్రవాద ధోరణిని కలిగి ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో అనుబంధం ఉన్నట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి.





Next Story