జమ్మూకశ్మీర్ లో భద్రత దళాలు విజయం సాధించాయి. కుప్వారా జిల్లా మచిల్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మిగిలిన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ‘‘కుప్వారా జిల్లాలోని దోబనార్ మాచల్ ప్రాంతంలో ఆర్మీ, కుప్వారా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను హతమయ్యారు. ఇంకా గాలింపు కొనసాగుతోంది’’ అని కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బందిపోరా పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ (RR), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జాయింట్ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 13 న జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. బహరాబాద్ హాజిన్ ప్రాంతంలో తీవ్రవాదిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అతడి దగ్గర పలు ఆయుధాలు, గ్రెనేడ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.