తీవ్రవాదులకు సహాయం చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఆర్మీ అధికారులు
Two terrorist helpers arrested from Jammu and Kashmir. జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్
By Medi Samrat Published on 7 Jan 2022 2:45 PM GMTజమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా తీవ్రవాదులకు సహాయం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సైన్యం, పోలీసులు అనుమానాస్పదంగా దోడా జిల్లాకు చెందిన ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అతన్ని భద్రవాహ్ జైలులో ఉంచారు. పట్టుబడిన వ్యక్తి పేరు ఫరీద్ అహ్మద్ నాయక్ అని తెలుస్తోంది. ఫరీద్ కో ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నాడు, వారు వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ కోసం వర్చువల్ నంబర్‌లను ఉపయోగిస్తున్నారు. గుండానా (దోడా)కు చెందిన గులాం హుస్సేన్ అనే వ్యక్తి పాకిస్థాన్‌లో ఉన్న టెర్రరిస్టు మాస్టర్‌లతో టచ్‌లో ఉండి వారికి లాజిస్టిక్స్ సపోర్ట్, సమాచారం అందించడమే కాకుండా పాకిస్థాన్ నుండి దుబాయ్ ద్వారా డబ్బును అందుకున్నాడు. అధికారులు అతడిని కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం భద్రావా జైలులో అతడిని విచారిస్తున్నారు. దోడా ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడానికి పాక్ చేస్తున్న కుటిల ప్రయత్నం అని తెలుస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్‌లోని జోల్వా క్రాల్‌పోరా చదూరా ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని కశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ శుక్రవారం నాడు తెలిపారు. బుద్గాంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో సైన్యం సోదాలు జరుపుతుండగా ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులను మట్టుబెట్టిన అనంతరం ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు, బుల్లెట్లతోపాటు పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజిపి వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్ (జేఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన వారని భావిస్తున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో ఒకరిని శ్రీనగర్‌కు చెందిన వసీమ్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే-57 రైఫిళ్లు, 8 మ్యాగజైన్లు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.