బెంగుళూరు మెట్రో కోచ్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడమే కాదు.. ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. ఈ గొడవతో కోచ్ లో గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇద్దరు వ్యక్తులు రద్దీగా ఉండే మెట్రో కోచ్‌లో కోపంతో వాగ్వాదానికి దిగారు. కన్నడలో దుర్భాషలాడారు. గొడవను ఆపేందుకు ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా ఇద్దరూ ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు.
తీవ్ర వాగ్వాదం, గొడవ వెనుక కారణాలు తెలియరాలేదు. కోచ్‌లో స్థలం లేకపోవడం వల్ల ప్రయాణీకులు ఒకరినొకరు తోసుకుని ఉండవచ్చని పలువురు పేర్కొన్నారు. రద్దీగా ఉండే కోచ్‌లలో స్థలాభావం సమస్యకు తోడు ప్రయాణికులు తీసుకెళ్లే బ్యాక్‌ప్యాక్‌ల వల్ల కూడా ఈ గొడవ జరిగి ఉంటుందని కొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.