కర్ణాటకాలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు.. అధికారికంగా వెల్లడించిన కేంద్రం

Two Omicron cases registered in Karnataka.. Union Ministry of Health. ఇవాళ భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు వెలుగు చూసినట్లు

By అంజి  Published on  2 Dec 2021 11:45 AM GMT
కర్ణాటకాలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు.. అధికారికంగా వెల్లడించిన కేంద్రం

ఇవాళ భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు వెలుగు చూసినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన రెండు ఒమిక్రాన్‌ కేసులు కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూశాయని చెప్పారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ద్వారా ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్నట్లు ధ్రువీకరించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో 373 మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారని అన్నారు. అయితే భారత్‌లో ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకిందని, వారి వయస్సు 66, 46 ఏళ్లు అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కేంద్రం ఆధీనంలో ఉన్న 37 ల్యాబ్‌ల్లో ఇన్‌సాకాగ్‌ కాన్సార్టియమ్‌ చేపట్టిన జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించామ‌ని ఐసీఎంఆర్ డీజీ బ‌ల్‌రామ్ భార్గ‌వ్‌ పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అవగాహన తప్పనిసరి అని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలను పాటించాలని భార్గవ్‌ చెప్పారు. తాజాగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చిన వారి కర్ణాటక వాసుల కాంటాక్ట్‌లను గుర్తించామని అన్నారు. వారిని పర్యవేక్షిస్తున్నామని, ప్రోటోకాల్‌ ప్రకారం పరీక్షలు ఉంటాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రమాదకర దేశాల నుండి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఎయిర్‌పోర్టుల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.

Next Story