ఇండియన్ నేవీ సబ్ మెరైన్‌ల కీలక సమాచారం లీక్ కేసులో ప్రస్తుతం నేవీలో పని చేస్తున్న ఒక కమాండర్‌తోపాటు మొత్తం ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. భారత నేవీలోని జలాంతర్గాముల సమాచారాన్ని బయటి వ్యక్తులకు చెప్పారని, సబ్‌మెరైన్లలోని ఎంఆర్‌సీఎల్ సమాచారాన్ని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కమాండర్లు, రిటైర్డ్ అధికారులకు చేరవేశారని తెలిపింది. సదరు రిటైర్డ్ అధికారులు దక్షిణ కొరియా కోసం పని చేస్తున్నారని అభియోగం. గత సెప్టెంబర్ మూడో తేదీన రిటైర్డ్ నేవీ అధికారులు రణ్‌దీప్ సింగ్, ఎస్‌జే సింగ్‌ల అరెస్ట్‌తో అసలు సంగతి బయటపడింది. ఈ కేసులో సుమారు డజన్ మంది అధికారులకు సంబంధం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. రణదీప్ సింగ్ ఇంట్లో తనిఖీ చేసినప్పుడు రూ.2 కోట్ల నగదు సీబీఐ జప్తు చేసింది.
ఇక నేవీ వెస్ట్ కమాండ్ కమాండర్ అజిత్ కుమార్ పాండేను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. రక్షణ రంగంలో అవినీతికి సంబంధించిన కేసుల్లో ఇంత వేగంగా సీబీఐ చార్జిషీటు నమోదు చేయడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 3న తొలి అరెస్ట్ చేసిన సీబీఐ.. 60 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఒక కేసులో నేవీ కమాండర్లు రణదీప్ సింగ్, ఎస్‌జే సింగ్‌లు ఉంటే మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన అలెన్ రీన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.పి. శాస్త్రి, డైరెక్టర్లు ఎన్‌బి రావు, కె.చంద్రశేఖర్‌లు నిందితులుగా ఉన్నారు.