Video : 18 గంటలుగా సెల్‌ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.. వారి డిమాండ్ ఏమిటంటే..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మీనా వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో మొబైల్ టవర్ ఎక్కారు.

By Kalasani Durgapraveen  Published on  12 Nov 2024 5:42 AM GMT
Video : 18 గంటలుగా సెల్‌ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.. వారి డిమాండ్ ఏమిటంటే..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మీనా వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో మొబైల్ టవర్ ఎక్కారు. సోమవారం నాడు ఇద్దరూ మొబైల్ టవర్ ఎక్కారు. బాలికపై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వారిద్దరూ మొబైల్ టవర్ ఎక్కారు. ఇద్దరు వ్యక్తులను రక్షించేందుకు విద్యాపురి పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఏడాది మేలో పదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలిక చెవిటి, మూగ. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఈ కేసును సీబీఐచే విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తూ ఇద్ద‌రు వ్య‌క్తులు టవర్‌ను ఎక్కారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి వారు టవర్‌పైనే ఉన్నారు.

అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) లలిత్ కుమార్ శర్మ సోమవారం సంఘటన వివరాలను మీడియాతో పంచుకున్నారు. “ఇద్దరు వ్యక్తులు టవర్ పైకి ఎక్కారు. బాలిక‌ హత్య కేసులో వారు కొన్ని డిమాండ్లను కూడా కలిగి ఉన్నారని మాకు తెలిసింది. వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. వారిని దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు టవర్ పైన కూర్చున్నట్లు దృశ్యాలు చూపుతున్నాయి. అయితే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బంది వారిని ర‌క్షించేందుకు వలలు.. భద్రతా పరికరాలతో కింద‌ వేచి ఉన్నారు. టవర్‌పై నుంచి కిందకు వచ్చేలా వారిని ఒప్పించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story