డీఈఎంయూ రైలులో భారీ అగ్నిప్రమాదం
Two Coaches of Ratlam-Ambedkar Nagar Train Catch Fire. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆదివారం ఉదయం రత్లాం-డాక్టర్ అంబేద్కర్ నగర్ డీఈఎంయూ రైలులోని
By Medi Samrat Published on 23 April 2023 9:00 AM GMTTwo Coaches of Ratlam-Ambedkar Nagar Train Catch Fire
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆదివారం ఉదయం రత్లాం-డాక్టర్ అంబేద్కర్ నగర్ డీఈఎంయూ రైలులోని రెండు బోగీల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఓ అధికారి తెలిపారు. పశ్చిమ రైల్వేలోని రత్లాం డివిజన్‌లోని రత్లాం-ఇండోర్ రైలు మార్గంలోని ప్రీతమ్ నగర్ స్టేషన్ వద్ద ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని రత్లాం డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఖేమ్‌రాజ్ మీనా తెలిపారు. రత్లాంకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‌లో డీఈఎంయూ రైలు డ్రైవింగ్ మోటర్ కోచ్‌లో మంటలు చెలరేగాయి.
#WATCH | Madhya Pradesh: Fire broke out in the generator car of Ratlam-Dr Ambedkar Nagar Demu train at Pritam Nagar station in Ratlam earlier this morning. The fire was later extinguished. No injuries or casualties reported. pic.twitter.com/hrT3GRGhby
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 23, 2023
దాదాపు వారం రోజుల క్రితం గుజరాత్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. గుజరాత్‌లోని బోటాడ్ రైల్వే స్టేషన్ యార్డ్‌లో ఆగి ఉన్న డీజిల్-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డీఈఎంయూ) రైలులో మంటలు చెలరేగాయి. ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించినట్లు పశ్చిమ రైల్వేలోని భావ్‌నగర్ డివిజన్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మషూక్ అహ్మద్ తెలిపారు. “రైలు ఖాళీగా ఉన్నందున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైలులోని మూడు కోచ్‌లు కాలిపోయాయని బోటాడ్ మునిసిపాలిటీ అగ్నిమాపక అధికారి రాజుద్ ధధల్ తెలిపారు. సాయంత్రం 4.25 గంటలకు మూడు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేశారు.