25వ అంతస్తు నుంచి కిందపడ్డ కవలలు.. కారణం ఏమిటంటే..
Twin teens fall to death from 25th floor in Ghaziabad. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో 25వ అంతస్తు నుంచి కిందపడి ఇద్దరు కవల సోదరులు
By Medi Samrat
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో 25వ అంతస్తు నుంచి కిందపడి ఇద్దరు కవల సోదరులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న సత్యనారాయణ, సూర్యనారాయణ కవలలు. చెన్నైకి చెందిన వీరు రెండు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఘజియాబాద్ లో ఉంటున్నారు. అక్కడ సిద్ధార్థ్ విహార్ కాంప్లెక్స్‌లో 25వ అంతస్తులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం ముగించుకుని తల్లి రాధ మొబైల్ తీసుకుని ఆన్‌లైన్ క్లాస్ విన్నారు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లి కూర్చుని మొబైల్‌లో గేమ్స్ ఆడారు. కొద్దిసేపటికి తల్లి నిద్రపోమని తన గదిలోకి తీసుకుని వెళ్ళింది. తల్లి నిద్రపోయిన తర్వాత తిరిగి బాల్కనీలోకి వచ్చారు ఇద్దరు సోదరులు. అర్థరాత్రి 1 గంట సమయంలో ఇద్దరు సోదరులు 25వ అంతస్తు నుంచి పడి మృతి చెందారు.
తల్లికి మెలకువ రావడంతో లేచి పిల్లల కోసం వెతికింది. బాల్కనీ తలుపు తీసి ఉండటంతో అక్కడకు వెళ్లి చూసింది కానీ కనిపించలేదు. కింద జనాలు గుంపులుగా చేరడం చూడగా అక్కడకు వెళ్ళింది. చనిపోయింది తన పిల్లలే అని తెలుసుకున్న ఆమెకు దుఃఖం ఏ మాత్రం ఆగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సత్య, సూర్యల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాల్కనీలో మాకు ప్లాస్టిక్ చైర్, దాని మీద ఓ కూర్చి కనిపించిందని అన్నారు. చంద్రుడిని చూడాలని భావించి.. ఇలా ఏర్పాటు చేసుకుని ఉంటారని పోలీసులు తెలిపారు. నిద్రపోక ముందు పిల్లలు తల్లి రాధతో కూడా చంద్రుడిని చూడాలని ఉందని కోరినట్లు తెలుస్తోంది.