పొత్తుల్లేవ్.. సింహం వేటాడేందుకు వచ్చింది : దళపతి విజయ్
‘జన నాయకన్’ షూటింగ్‌తో పాటు రాజకీయ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నాడు దళపతి విజయ్.
By Medi Samrat
‘జన నాయకన్’ షూటింగ్‌తో పాటు రాజకీయ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నాడు దళపతి విజయ్. తాను మదురై తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఈరోజు జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) బీజేపీ, డీఎంకేతో పొత్తు పెట్టుకోదని ఆయన ప్రకటించారు. మదురైలో జరిగిన టీవీకే రెండో సదస్సులో విజయ్ ప్రసంగిస్తూ.. అధికార డీఎంకే తమ పార్టీకి రాజకీయ శత్రువు అని, బీజేపీ విధానమే శతృవు అని అన్నారు.
దళపతి విజయ్ మాట్లాడుతూ.. సింహం ఎప్పుడూ సింహమే.. అడవిలో చాలా నక్కలు, ఇతర జంతువులు ఉంటాయి.. కానీ సింహం ఒంటరిగా ఉన్నా అడవికి రారాజు.. సింహం వేటాడేందుకు ఇక్కడికి వచ్చింది. టీవీకే బీజేపీతో చేతులు కలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లేదు అని స్పష్టత ఇచ్చారు. మా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదని.. మా పార్టీ ప్రజల పార్టీ అని.. తమిళనాడు ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారని తలపతి విజయ్ అన్నారు.
త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్య పోటీ జరుగుతుందని, ఆ పార్టీకి ఓటు వేయాలని విజయ్ తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. పెద్ద నాయకులందరూ మేధావులు కాదు, సినీ నటులందరూ మూర్ఖులు కాదు అని ఆయన అన్నారు.
దళపతి విజయ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.. మీ అందరికీ కృతజ్ఞతతో రాజకీయాల్లోకి వచ్చాను. మీరు గత 30 సంవత్సరాలుగా నాతో ఉన్నారు. నన్ను మీ కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ఈ క్షణంలో.. నేను నా హృదయంలోని ప్రేమను మీపై కురిపించాలనుకుంటున్నాను. "నేను ప్రజలను ఆరాధిస్తాను.. వారిని గౌరవిస్తాను. ప్రజలకు సేవ చేయడం ఒక్కటే నా ధ్యేయం.. నేను మీ వెంట ఉంటాను. ఇది కేవలం సాధారణ ప్రకటన కాదు అన్నారు.