వాతావరణ న్యూస్ చదువుతూ కుప్పకూలిపోయిన న్యూస్ యాంకర్

పశ్చిమ బెంగాల్‌ లో వేడిగాలులు ఎక్కువయ్యాయి. ప్రజాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణానికి సంబంధించిన వార్తలు చదువుతూ యాంకర్ కుప్పకూలిపోయింది

By Medi Samrat  Published on  21 April 2024 9:54 AM GMT
వాతావరణ న్యూస్ చదువుతూ కుప్పకూలిపోయిన న్యూస్ యాంకర్

పశ్చిమ బెంగాల్‌ లో వేడిగాలులు ఎక్కువయ్యాయి. ప్రజాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణానికి సంబంధించిన వార్తలు చదువుతూ యాంకర్ కుప్పకూలిపోయింది. దూరదర్శన్ యాంకర్ లోపాముద్ర సిన్హా ప్రత్యక్ష ప్రసారం సమయంలో కుప్పకూలిపోయింది. దూరదర్శన్ కోల్‌కతా బ్రాంచ్‌లో సిన్హా ఒక్కసారిగా పడిపోవడంతో అందరూ ఆమెకు ఏమైనా అయిందేమో షాక్ అయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇస్తూ ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. లైవ్ లో వార్తలు చదువుతున్న సమయంలో తన రక్తపోటు పడిపోయిందని తెలిపింది. వార్తలు చదవడానికి ముందు అనారోగ్యంగా అనిపించినప్పటికీ, ఒక గ్లాసు నీరు తాగి వార్తలను చదవడానికి ప్రయత్నించింది. అయితే.. ఆ తర్వాత ఆమె ప్రోగ్రామ్‌ ధ్యాసలో ఉండి నీటిని తాగలేకపోయింది. ఇంతలో లో బీపీ కారణంగా ఆమె స్పృహ కోల్పోయింది. ముఖ్యంగా రాష్ట్రంలో వాతావరణానికి సంబంధించిన వార్తలను కవర్ చేసే సమయంలో ఆమె బ్లాక్‌అవుట్‌ అయింది.

ఈ సంఘటన తరువాత.. సిన్హాకు పలువురు సంఘీభావం తెలుపుతూ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ భాగంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి ఐదు పాయింట్లు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, పుర్బా, పశ్చిమ్ బర్ధమాన్, పశ్చిమ్ మెదినీపూర్, పురూలియా, ఝర్‌గ్రామ్, బీర్భూమ్, ముర్షిదాబాద్, బంకురా జిల్లాల్లో వేడిగాలుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.

Next Story