బ్రేకింగ్ : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ రాజీనామా

Tripura Chief Minister Biplab Deb Resigns A Year Ahead Of Elections. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తన రాజీనామాను గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు సమర్పించినట్లు శనివారం

By Medi Samrat  Published on  14 May 2022 5:18 PM IST
బ్రేకింగ్ : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ రాజీనామా

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తన రాజీనామాను గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు సమర్పించినట్లు శనివారం తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం దేబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీని బలోపేతం చేసేవిధంగా నేను పని చేయాలని అధిస్టానం కోరుకుంటోందని బిప్లబ్ దేబ్ చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. బిజెపి రాష్ట్ర శాఖలో అంతర్గత పోరు గురించి నివేదికల నేపథ్యంలో రాజీనామా చేశారనే వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

త్రిపురలోని బీజేపీ శాసనసభా పక్షం కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు.. ఈరోజు తర్వాత సమావేశం కానుందని నివేదికలు చెబుతున్నాయి. శాసనసభా పక్ష నేత ఎన్నికకు పరిశీలకులుగా సీనియర్ నేతలు భూపేందర్ యాదవ్, వినోద్ తావ్డేలను బీజేపీ అధిస్టానం నియమించింది. వీరితో పాటు పార్టీ రాష్ట్ర ఇంచార్జి వినోద్ సోంకర్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇదిలావుంటే.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 25 ఏళ్ల పాలనకు ముగింపు పలికి.. 2018లో బిప్లబ్ దేబ్ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు.














Next Story