ఘోరం..ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లిన ఆర్‌టీసీ బస్సు, రెండేళ్ల బాలుడు మృతి (video)

కర్ణాటకలోని హవేరి సెంట్రల్ బస్ స్టాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది

By -  Knakam Karthik
Published on : 1 April 2026 6:42 PM IST

National News, Karnataka,  Haveri, KSRTC, Accident, Tragedy

ఘోరం..ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లిన ఆర్‌టీసీ బస్సు, రెండేళ్ల బాలుడు మృతి (video)

కర్ణాటకలోని హవేరి సెంట్రల్ బస్ స్టాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ఒక కేఎస్‌ఆర్‌టీసీ (KSRTC) బస్సు అదుపు తప్పి ప్లాట్‌ఫారమ్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బస్సు కోసం వేచి చూస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు సాధారణ మార్గంలో రాకుండా ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్ వైపు దూసుకురావడంతో, అక్కడున్న వారు తప్పించుకునే లోపే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న అత్యవసర సేవా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Next Story