మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో కుటుంబ సభ్యులను కోల్పోయిన భక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని అత్యంత బాధాకరమని అభివర్ణించారు. ఎక్స్ పోస్ట్‌లో ప్రయాగ్‌రాజ్‌లోని రూరల్ గవర్నమెంట్ బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నానని ప్రధాని మోదీ తెలిపారు.
మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు చేసేందుకు కోట్లాది మంది యాత్రికులు గంగలోకి పరుగులు తీయడంతో బుధవారం తెల్లవారుజామున మహా కుంభ్‌లోని సంగం ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల మధ్య కొందరు భక్తులు అఖారా మార్గ్ వద్ద బారికేడ్లపైకి ఎక్కినప్పుడు ఈ ఘటన జరిగిందని ఆదిత్యనాథ్ తెలిపారు.
నేడు మౌని అమావాస్య రోజు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ఇవాళ కుంభమేళాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నదీ స్నానానికి భక్తులు తరలి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో నదుల్లో స్నానాలు చేస్తున్నారు. తమిళనాడులో తామిరభరణి, మధ్యప్రదేశ్‌లో షిప్రా, హరిద్వార్‌లో గంగా నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు.