ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు పోషకాహార శాఖ సహాయ మంత్రి ప్రతిభా శుక్లా ధరల పెరుగుదలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. నిమ్మకాయలు తింటే ఆటోమేటిక్‌గా టమాటా ధరలు తగ్గుతాయని మంత్రి వ్యాఖ్యానించారు. టమోటాలు రేటు పెరిగితే.. తినడం మానేయండి లేదా ఇంట్లో ఒక కుండలో టమోటా మొక్కను పెంచండని ఉచిత సలహా ఇచ్చారు. ఖరీదైన వస్తువులను తినడం మానేస్తే.. వాటి ధరలు ఆటోమేటిక్‌గా తగ్గుతాయని జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
సీతాపూర్ రోడ్డులోని ఇటౌలీలోని ఎంఆర్‌ఎఫ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి.. ప్రజలంతా ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం టమాటా ధరల పెరుగుదలపై విలేకరులు ప్రశ్నలు అడగగా.. కుండీల్లో టమోటాలు నాటండి అని బదులిచ్చారు. ఖరీదైన వస్తువులు తినడం మానేయండి.. ఆటోమేటిక్‌గా చౌకగా లభిస్తాయని సమాధానమిచ్చారు. ఇంటి వద్దే న్యూట్రిషన్ గార్డెన్ తయారు చేసుకోవాలన్నారు. ఐదు కుండీల్లో టమాటా మొక్కలు నాటండని సూచించారు. మీరు టమోటా వద్దనుకుంటే.. నిమ్మకాయను వాడండి.. ఏవి ఖరీదైనవి అయితే.. వాటిని వదిలివేయండి. ఆటోమేటిక్‌గా చౌకగా అభిస్తాయని వ్యాఖ్యానించారు.