షాప్ ముందు బౌన్సర్ల‌ను ఉంచి ట‌మాటాలు అమ్ముతున్న వ్యాపారి

Tomato Price Vegetable Vendor In Varanasi Hired Bouncers To Saftey Of Customers. ప్ర‌స్తుతం టమాట 'ధర' ఆకాశాన్ని అంటుతోంది. దేశంలోని పలు నగరాల్లో టమాటా ధర పెట్రోల్‌ ధరను మించిపోయింది.

By Medi Samrat  Published on  9 July 2023 12:37 PM GMT
షాప్ ముందు బౌన్సర్ల‌ను ఉంచి ట‌మాటాలు అమ్ముతున్న వ్యాపారి

ప్ర‌స్తుతం టమాట 'ధర' ఆకాశాన్ని అంటుతోంది. దేశంలోని పలు నగరాల్లో టమాటా ధర పెట్రోల్‌ ధరను మించిపోయింది. పక్షం రోజుల క్రితం వరకు కిలో రూ.15 నుంచి 20కి లభించే టమాటా జూలై మొదటి తేదీ నుంచి విపరీతంగా పెరగ‌సాగింది. వారణాసిలో కూడా టమాట కిలో రూ.120 నుంచి 150 వరకు ప‌లుకుతుంది. ఈ నేపథ్యంలో కూరగాయలను విక్రయించే ఎస్పీ కార్య‌క‌ర్త‌ అజయ్ ఫౌజీ తన దుకాణం వద్ద బౌన్సర్‌ల‌ను ఉంచి వ్యాపారం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. పోటోల‌లో.. మొదట డబ్బు.. తర్వాత టమాటాలు.. దయచేసి టమోటాలు ముట్టుకోవద్దు.. వంటి బోర్డులు ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఈ విషయమై కూరగాయల దుకాణదారుడు అజయ్‌ ఫౌజీ మాట్లాడుతూ.. టమోటాలు చాలా ఖరీదయ్యాయి. ద్రవ్యోల్బణం కారణంగా, ప్రజలు 100, 50 గ్రాములు తీసుకుంటున్నారు. టమాటాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు చాలా చోట్ల నుంచి సమాచారం వచ్చింది. అలా ఎక్కడికక్కడ టమోటాలు దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా టమాటాల కారణంగా వివాదాల పరిస్థితి నెలకొంది. వివాదాన్ని నివారించడానికి, తమను, టమోటాలను రక్షించుకోవడానికి ఇద్దరు బౌన్సర్‌లను దుకాణం వద్ద మోహరించాం. టమోటాలన్నీ అమ్ముడయ్యాక.. ఈ బౌన్సర్లను పంపించేస్తామ‌న్నారు.

షాప్ బయట బౌన్సర్లు నిలబడి ఉన్నారు. ఏవ‌రైనా కస్టమర్ కూరగాయలను ముట్టుకుని బేరం చేస్తే.. బౌన్సర్లు వారిని ఆపేస్తున్నారు. ఏది కావాలంటే అది అడగండి అంటున్నారు. ట‌మాట కావాలంటే.. మొదట డబ్బు ఇవ్వండి.. ఆపై టమోటాలు తీసుకోండి అని చెబుతున్నారు. అయితే అక్కడ ఉన్న చాలా మంది.. దుకాణదారుడు ఎస్పీ కార్యకర్త అని చెప్తున్నారు. ఈ కారణంగానైనా ద్రవ్యోల్బలం చర్చలోకి వ‌స్తుందంటున్నారు. ప్ర‌స్తుతం షాపు చర్చనీయాంశమైంది.


Next Story