కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు

బీహార్‌లోని బెట్టియాలో ఒక పసివాడు ఆడుకుంటూ నాగుపామును నోటితో కరిచేశాడు.

By Medi Samrat
Published on : 26 July 2025 8:15 PM IST

కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు

బీహార్‌లోని బెట్టియాలో ఒక పసివాడు ఆడుకుంటూ నాగుపామును నోటితో కరిచేశాడు. ఈ ఘటనలో పాము చనిపోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గోవింద అనే బాలుడు పశ్చిమ చంపారన్ జిల్లాలోని మోహచ్చి బెంకట్వా గ్రామంలో తన ఇంట్లో ఉన్నాడు. ఆ పాము అతడికి దగ్గరగా పాకింది.ఆ పిల్లవాడు చేతులతో పామును ఎత్తుకుని కొరికేశాడు. క్షణాల్లో పాము చనిపోయింది.

గోవింద కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటం గమనించిన ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించారు. గోవింద అమ్మమ్మ మతేశ్వరి దేవి మాట్లాడుతూ, అతని తల్లి ఇంటికి కొంచెం దూరంగా కట్టెలు సేకరిస్తుండగా, రెండు అడుగుల నాగుపాము ఇంటి ఆవరణలోకి చొరబడిందని చెప్పారు.

బెట్టియలోని GMCH హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ దిస్వాకాంత్ మిశ్రా మాట్లాడుతూ పిల్లాడి శరీరంలో విషం చేరినట్లుగా ఎలాంటి లక్షణాలు లేవని, అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Next Story