మహారాష్ట్ర రాష్ట్రంలో ఘోరమైన ఘటన జరిగింది. చంద్రాపూర్ జిల్లాలో పులుల గణన కోసం ఫారెస్ట్‌లోకి వెళ్లిన ఓ మహిళా ఉద్యోగినిపై పులి దాడి చేసింది. ఆ తర్వాత పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి చంపేసింది. ఈ ఘటన శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తడోబా అడవిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా తడోబా అడవిలో ఫారెస్ట్ అధికారులు పులుల గణన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది, అటవీ కూలీలు కోలారా గేట్ దగ్గర ఉన్న 97వ కోర్ జోన్‌లోకి వెళ్లారు. వాటర్ హోల్ దగ్గర నీరు ఉందా లేదా అని ఆమె తనిఖీ చేసింది.
ఈ క్రమంలోనే పులి అకస్మాత్తుగా వారిపై దాడి చేసింది. ఫారెస్ట్ ఉద్యోగిని స్వాతి ధోమనే (43)పై దాడి చేసింది. ఆ తర్వాత చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి చంపేసింది. అప్పటికే అటవీ కూలీలు వెంబడించిన ఉద్యోగిని పులి వదిలిపెట్టలేదు. విషయం తెలుసుకున్న తడోబా మేనేజ్‌మెంట్ అధికారి, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలోని దట్టమైన పొదల మధ్య స్వాతి ధోమనే మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో అటవీశాఖ సిబ్బందిలో భయానక వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం దేశంలోని అన్ని అడవులను అటవీ శాఖ పులుల గణనకు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే స్వాతి ఈ కోర్ జోన్‌కు వెళ్లింది. మృతురాలు మహిళా అటవీ రేంజర్ స్వాతి గతేడాది వీరూర్ ఫారెస్ట్ రిజర్వ్ నుంచి తడోబాకు బదిలీ అయ్యారు. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు. జలమండలి సమీపంలో జరిగిన ఈ ఘటనతో అటవీశాఖ సిబ్బందిలో భయానక వాతావరణం నెలకొంది. ట్రాన్సిట్ లైన్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా టైగర్ లైన్ సర్వే నేటి నుంచి ప్రారంభమైంది. నవంబర్ 26 వరకు సర్వే కొనసాగనుంది. తడోబాలోని కొలారా గేట్ ద్వారా వీఐపీలు వస్తుంటారు. ఈ గేటు దగ్గర వెదురు రిసార్టులు ఉన్నాయి. కాబట్టి ఈ గేటుకు క్రేజ్ ఎక్కువ. ఈ గేట్‌లోని అడవిలో పులి అటవీ రేంజర్‌ను చంపింది. తడోబాలో పులులు దూకుడుగా మారాయి.