ప్రభుత్వ ఉద్యోగి మృతి.. ఉద్యోగం ఇవ్వమని ఆఫీసుకు వచ్చిన ముగ్గురు భార్యలు
యూపీలోని ఝాన్సీ నీటిపారుదల శాఖలో ఉద్యోగి మృతి చెందడంతో కారుణ్య ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ అతని ముగ్గురు భార్యలు అధికారులను కలిశారు
By Medi Samrat Published on 8 Jun 2024 2:00 PM ISTయూపీలోని ఝాన్సీ నీటిపారుదల శాఖలో ఉద్యోగి మృతి చెందడంతో కారుణ్య ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ అతని ముగ్గురు భార్యలు అధికారులను కలిశారు. ఒకే ఉద్యోగంను ముగ్గురు భార్యల కావాలని అడగడంతో అధికారులు కంగుతిన్నారు. తమను మొదటి భార్యగా భావించి ఉద్యోగం ఇప్పించాలని ముగ్గురూ డిమాండ్ చేస్తున్నారు. ముగ్గురూ వివాహ సంబంధిత పత్రాలను కూడా సమర్పించారు. ఈ అంశంపై ఇరిగేషన్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
మటటిలా నీటిపారుదల డివిజన్‌లో నాలుగో తరగతి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న సంతోష్‌కుమార్ ఫిబ్రవరి 6న క్యాన్సర్‌తో మృతి చెందాడు. తన భర్త మరణించిన తర్వాత.. అతని స్థానంలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తల్బెహట్ నివాసి క్రాంతి వంశ్కర్ అధికారుల వద్దకు వెళ్లారు. సంతోష్ మరణ ధ్రువీకరణ పత్రం, వారసుడు సహా ఇతర పత్రాలను అధికారులకు అందజేశారు.
కొన్ని రోజుల తర్వాత భోపాల్ నివాసి సునీతా వర్మ కూడా ఆఫీసుకు వెళ్లారు. సంతోష్ భార్యను అని.. తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరింది. అధికారులు డాక్యుమెంట్లు అడగడంతో పెళ్లి కార్డు, ఫొటో, ఇతర పత్రాలను కూడా సునీత అందజేసింది.
వారిద్దరి డాక్యుమెంట్లు చూసి అధికారులు అవాక్కయ్యారు. వీరిద్దరి కాగితాలను పరిశీలిస్తుండగా.. తల్బెహట్‌కు చెందిన రాజో అనే మహిళ కూడా మటటిలా కార్యాలయానికి చేరుకుంది. తాను సంతోష్ భార్యనని చెబుతూ.. ఉద్యోగం ఇప్పించాలని అభ్యర్థించింది. SDM జారీ చేసిన కుటుంబ ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించింది.
ఒకే ఉద్యోగం కోసం ముగ్గురు భార్యల వాదనలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. సంతోష్ పాత డాక్యుమెంట్లు వెతికినా.. అందులో పూర్తి వివరాలు దొరకలేదు. సంతోష్ సర్వీస్ రికార్డులను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ముగ్గురు మహిళలు తాము సంతోష్ భార్యలమని చెబుతున్నారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంకజ్ సింగ్ చెప్పారు. వివాహ పత్రాలు కూడా సమర్పించారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని అన్నారు.