ఛత్తీస్‌గఢ్ మళ్లీ ఎదురుకాల్పులు, ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పుల ఘటన జరిగింది.

By -  Knakam Karthik
Published on : 16 Nov 2025 1:09 PM IST

National News, Chhattisgarh, Three Maoists killed, Security Forces

ఛత్తీస్‌గఢ్ మళ్లీ ఎదురుకాల్పులు, ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పుల ఘటన జరిగింది. ఈ ఎదురు తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడుతున్నారన్న స్పష్టమైన సమాచారం రావడంతో, డీఆర్‌జీ జట్లు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. దాంతో ఉదయం గంటల నుంచే ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.

ఘటన ప్రాంతం నుంచి మూడు మావోయిస్టుల శవాలు మరియు కొంతమంది వద్ద ఉన్న ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ పూర్తిగా ముగిసిన తర్వాత మృతుల వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Next Story