ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

మంగళవారం షోపియన్‌లోని జిన్‌పథేర్ కెల్లర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.

By Medi Samrat
Published on : 13 May 2025 6:15 PM IST

ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

మంగళవారం షోపియన్‌లోని జిన్‌పథేర్ కెల్లర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ముగ్గురిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులను షాహిద్ కుట్టాయ్, అద్నాన్ షఫీగా గుర్తించారు, ఇద్దరూ షోపియన్ నివాసితులు. 2023లో లష్కరేలో చేరిన కుట్టాయ్, గత ఏడాది ఏప్రిల్ 8న డానిష్ రిసార్ట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో పాల్గొన్నాడు. ఇందులో ఇద్దరు జర్మన్ పర్యాటకులు, ఒక డ్రైవర్ గాయపడ్డారు. గత ఏడాది మేలో షోపియన్‌లోని హీర్పోరాలో జరిగిన సర్పంచ్ హత్యలో కూడా అతనికి సంబంధం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2024లో ఉగ్రవాద సంస్థలో చేరిన షఫీ, షోపియన్‌లోని వాచిలో స్థానికేతర కార్మికుడిని హత్య చేయడంలో పాల్గొన్నాడని తెలుస్తోంది. మిగిలిన ఉగ్రవాది గుర్తింపు ఇంకా నిర్ధారించలేదు. ఉగ్రవాదులపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు షోపియాన్‌ జిల్లాలో మొహరించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఓ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి

Next Story