మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఓ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే.ఇండోర్ జిల్లాలోని స్వర్న్ బాగ్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. భవనంలో 16 మంది మంటల్లో చిక్కుకోగా ఏడుగురు సజీవ దహనమయ్యారు.
ఇండోర్ ప్రమాదాన్ని మరవకముందే జార్ఖాండ్‌లోని జంషెడ్‌పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్లు గాయపడ్డారు. కోక్ ప్లాంట్‌లో పేలుడు జరగడంతో ప్లాంట్ ఆవరణలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని కంపెనీ అధికారులు చెప్పారు. కోక్ ప్లాంట్‌లోని బ్యాటరీ 6 వద్ద గ్యాస్ లైన్ వద్ద పేలుడు జరిగిందని, ప్రస్తుతం బ్యాటరీ 6లో ఎలాంటి ఆపరేషన్ జరగడం లేదని, డిస్మాంటలింగ్ ప్రోసెస్ జరుగుతోందని తెలిపారు. ఇదే టాటాస్టీల్ ప్లాంట్‌లో 2013 నవంబర్‌లోనూ పేలుడు జరగడంతో 11 మంది గాయపడ్డారు.