Big Breaking : జమ్మూలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కాలువ‌లో పడిపోయింది.

By Medi Samrat  Published on  20 Sept 2024 7:24 PM IST
Big Breaking : జమ్మూలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కాలువ‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రెండు డజన్ల మందికి పైగా సైనికులు గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలంలో స్థానికులు స‌హాయ‌క చ‌ర్య‌ల ద్వారా సైనికులను కాపాడుతున్నారు.

పుల్వామా నుండి బుద్గామ్‌కు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సైనికులు ప్ర‌యాణిస్తున్న‌ బస్సు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో మరో 26 మంది గాయపడిన‌ట్లు జాతీయ మీడియా పేర్కొంది. రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా విధులు నిర్వ‌ర్తించేందుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలు ప్రారంభించారు.

Next Story