కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది.. 15 రోజుల్లో పేల్చేస్తాం : ఎంపీకి బెదిరింపు లేఖ
By Medi Samrat Published on 13 Nov 2024 6:44 PM ISTపూర్నియా ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ అర్జున్ భవన్ కార్యాలయానికి ఒక బెదిరింపు లేఖ చేరడం కలకలం సృష్టించింది. 15 రోజుల్లో అర్జున్ భవన్‌ను పేల్చివేస్తామని స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖ పంపారు. ఈ విషయాన్ని ఎంపీ కార్యాలయం నుంచి వాట్సాప్ ద్వారా పోలీసు సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. సాయంత్రం వరకూ దీనికి సంబంధించి ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.
సుపాల్ జిల్లాలోని ఛతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కామత్ కిషుంగంజ్ గ్రామానికి చెందిన కుందన్ కుమార్ ఈ లేఖను పంపారు. పంపిన వ్యక్తి కుందన్ కుమార్ ఈ లేఖలో రెండు మొబైల్ నంబర్లను కూడా పేర్కొన్నారని ఎంపీ ప్రతినిధి రాజేష్ యాదవ్ తెలిపారు. ఈ లేఖలో మీరు ఎంపీనని, ఎంపీగానే ఉండాలని ఎంపీకి సూచించారు. నిందితుడి స్నేహితుడు లారెన్స్ బిష్ణోయ్ సబర్మతి జైలు నుంచి ఎంపీకి పదేపదే ఫోన్ చేస్తున్నాడని.. ఎంపీ ఫోన్ ఎత్తడం లేదని లేఖలో పేర్కొన్నారు. కౌంట్‌డౌన్ మొదలయ్యిందని.. 15 రోజుల్లో అర్జున్ భవన్‌ను పేల్చివేస్తామని బెదిరించారు. సంప్రదించడానికి మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు. లేఖలో నిందితుడు తన పూర్తి వివరాలను తెలిపిన తీరును బట్టి ప్రాథమికంగా చూస్తే అతడు మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సమాచారం ఇప్పుడే వాట్సాప్ ద్వారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు అందజేశామని ఎంపీ ప్రతినిధి తెలిపారు. ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కోసం జార్ఖండ్‌లో ఉన్నారు.