భూమిలో నుండి ఏడుపు శబ్దం.. తీరా చూస్తే..
The sound of crying coming from inside the soil. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో నది ఒడ్డున ఇసుకలో ఏడుపు వినిపిస్తూ ఉంది.
By Medi Samrat Published on 3 Dec 2021 11:20 AM GMTమధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో నది ఒడ్డున ఇసుకలో ఏడుపు వినిపిస్తూ ఉంది. ఏముందబ్బా అని చూడగా.. నాలుగంటే నాలుగు రోజుల వయసు ఉన్న శిశువు బయట పడింది. నాలుగు రోజుల పసికందును చంపేయాలనే ఉద్దేశ్యంతో నిర్దాక్షిణ్యంగా నది ఒడ్డున పాతి పెట్టారు. సమీపంలోని పొలంలో పని చేస్తున్న కొందరు గ్రామస్థులు చిన్నారి ఏడుపు విని ప్రాణాలను రక్షించారు. పిల్లాడిని పాతి పెట్టిన తర్వాత ఓ వ్యక్తి పారిపోయినట్లు తెలుస్తోంది. గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకోగా మట్టి లోపలి నుండి నవజాత శిశువు యొక్క ఏడుపు వినిపించింది. దీంతో వారు కూడా షాకయ్యారు. దీంతో వాళ్లు మట్టిని జాగ్రత్తగా తొలగించారు.
లోపలి నుండి ఒక సజీవ శిశువు బయటకు వచ్చింది. గ్రామస్థులు చిన్నారిని మట్టిలోంచి బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిని ముంగావలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. చిన్నారి ఆరోగ్యంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో అంగన్‌వాడీ కార్యకర్తలను, గ్రామస్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఎస్‌ఐ సతీష్ గార్గ్ మాట్లాడుతూ.. పాప వయసు మూడు- నాలుగు రోజులేనని తెలిపారు. నది ఒడ్డున ఓ చిన్నారిని మట్టిలో పూడ్చిపెట్టినట్లు గ్రామస్తులు తెలిపారని.. ఆ తర్వాత చిన్నారిని ఆస్పత్రిలో చేర్చామని అన్నారు. గుర్తు తెలియని నిందితులపై సెక్షన్ 317 కింద కేసు నమోదు చేయబడిందని.. నిందితుడి కోసం అన్వేషణ మొదలుపెట్టామని అన్నారు.