టీవీలో మోదీ ఫోటో కనిపించగానే.. ఖర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ధార్ జిల్లాలో 'భారత్ జోడో న్యాయ యాత్ర' సమావేశంలో ప్రసంగిస్తూ

By Medi Samrat  Published on  6 March 2024 5:41 PM IST
టీవీలో మోదీ ఫోటో కనిపించగానే.. ఖర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ధార్ జిల్లాలో 'భారత్ జోడో న్యాయ యాత్ర' సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా టార్గెట్ చేశారు. టీవీ స్విచ్ ఆన్ చేయగానే మోదీ కనిపిస్తార‌ని.. మోదీ ఫొటో కనిపించగానే ఇల్లు దరిద్రంలోకి పోతుంద‌ని అన్నారు. ప్ర‌ధాని మోదీకి అభివృద్ధి అక్కర్లేదని, పేదల సంక్షేమం అక్కర్లేదని, పిల్లల చదువులు అక్కర్లేదని, పేదల బిడ్డ చదువుకుని ముందుకు వస్తే వారికి కష్టమని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. అందుకే ఆయ‌న‌ ఎప్పుడూ మనకి వ్యతిరేకంగా ఉంటారు. పేదల మీద మాత్రమే లాఠీ ఎత్తారు.. కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్న క్ర‌మంలో దాన్ని అణిచివేసే పని జరుగుతుందన్నారు.

మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై మల్లికార్జున్ ఖర్గే ఎదురుదాడికి దిగారు. బీజేపీ నాయకులు ప్రసంగాలు చేసినప్పుడల్లా కాంగ్రెస్ గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కలిసి పనిచేస్తున్నారని కొద్ది రోజుల క్రితం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ ఎందుకు అధికారం నుండి దించిందని ప్రశ్నించారు.

ఆదివాసీలను బీజేపీ అటవీ వాసులుగా పిలుస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. గిరిజన, అటవీ నివాసుల మధ్య పెద్ద తేడా ఏమిటి.? గిరిజనుడు అంటే ఈ భూమికి మొదటి యజమాని అయిన వ్యక్తి. ఈ దేశంలో గిరిజనులు నివసించిన కాలం ఉంది. గిరిజనులే దేశానికి మొదటి యజమానులు, కానీ అధికార పార్టీ నేత‌లు మిమ్మల్ని గిరిజనులు అని పిలవరు.. ఎందుకంటే వారు మీకు నీరు, అడవి, భూమిపై హక్కులు ఇవ్వవలసి ఉంటుందని పిల‌వ‌ర‌న్నారు.

Next Story