తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో వరుడు షాక్
The groom shocked by hearing bride said in First Night.వారిద్దరికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. వివాహ తంతు
By తోట వంశీ కుమార్ Published on 9 April 2022 12:14 PM ISTవారిద్దరికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. వివాహ తంతు ముగిసింది. పెద్దలు వారిద్దరికి తొలి రాత్రి ఏర్పాటు చేశారు. తొలి రేయిన ఇద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకోవాలనుకున్నారు. తమ జీవితంలో అప్పటి వరకు ఎదురైన సంఘటనలను ఒకరితో మరొకరు పంచుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వధువు చెప్పిన నిజంతో వరుడికి ఊహించని షాక్ తగిలింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. వధూవరులు తొలిరాత్రి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ జీవితంలో జరిగిన ఘటనల గురించి ఒకరినొకరు పంచుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో వరుడు తనకు సంబంధించిన విషయాలన్ని చెప్పేశాడు. అనంతరం వధువు చెప్పిన విషయం విని వరుడు షాకైయ్యాడు. గతంలో తనపై మేనమామ కుమారుడు అత్యాచారం చేసినట్లు చెప్పింది. షాక్‌కు గురైన భర్త.. ఆమెను మరుసటి రోజు ఉదయమే పుట్టింటిలో విడిచిపెట్టేశాడు. బంధువులకు ఆ విషయం అప్పుడే తెలియడంతో అంతా ఆశ్చర్యపోయారు.
ఇక తమ వివాహాన్ని రద్దు చేయాలంటూ సదరు భర్త కోర్టును ఆశ్రయించాడు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నిసార్లు నోటీసులు పంపినప్పటికీ భార్య స్పందించలేదు. కోర్టుకు హాజరుకాలేదు. మూడేళ్ల పాటు సాగిన విచారణను ఇటీవల కోర్టు ముగిస్తూ తీర్పు నిచ్చింది. యువకుడు కోరిన విధంగా 2019లో జరిగిన వారి పెళ్లిని రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.