లాక్‌డౌన్‌కు మేం సిద్ధం అంటున్న ఢిల్లీ సర్కార్‌.!

The Delhi government says we are ready for a complete lockdown. గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

By అంజి  Published on  15 Nov 2021 1:28 PM IST
లాక్‌డౌన్‌కు మేం సిద్ధం అంటున్న ఢిల్లీ సర్కార్‌.!

గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టులో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసం.. ఢిల్లీ గాలి కాలుష్యంపై అత్యవసర విచారణ చేపట్టింది. ఢిల్లీ ప్రభుత్వం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించింది. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కేవలం 10 శాతం మాత్రమే కాలుష్యం వస్తోందని తెలిపారు.

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఒక ప్రణాళికను కోర్టుకు అందించారు. ఈ ప్రణాళికలో విద్యుత్‌ ఫ్యాక్టరీలు, స్టోన్‌ క్రషర్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తనం దహనం చేయడాన్ని ఆపివేయడం వంటివి ఉన్నాయి. దీని వల్ల కొంత ఫలితం ఉంటుందని తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు ప్రమాణ పత్రం సమర్పించింది. జాతీయ రాజధాని పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో కూడా కఠిన నిబంధనలు అమలు చేయాలని, లాక్‌డౌన్‌ మాత్రమే కొంత మేర కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొంది.

విచారణ సందర్భంగా ఢిల్లీలో రోడ్డు శుభ్రం చేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయని జస్టిస్‌ సూర్యకాంత్‌ ఢిల్లీ తరఫు సీనియర్‌ అడ్వొకేట్‌ రాహుల్‌ మెహ్రాను ప్రశ్నించగా.. అతడు సమాధానం చెప్పలేకపోయారు. ఇలాంటి కుంటి సాకులు చెబితే మీరు ఆర్జిస్తున్న ఆదాయంపై ఆడిట్‌ చేయాల్సి ఉంటుందని జస్టిస్‌ సూర్యకాంత్‌ హెచ్చరించారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశంపై పరిశీలించానలి సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

Next Story