జూన్ 1 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్స, మందులు ఉచితం

Tests, treatment, medicines to be free at govt hospitals in Chhattisgarh from June 1. జూన్ 1 నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ ఆధీనంలోని ఆరోగ్య కేంద్రాల్లో అన్ని పరీక్షలు, చికిత్సలు, మందులు ఉచితం

By Medi Samrat  Published on  21 March 2023 8:58 PM IST
జూన్ 1 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్స, మందులు ఉచితం

Tests, treatment, medicines to be free at govt hospitals in Chhattisgarh


జూన్ 1 నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ ఆధీనంలోని ఆరోగ్య కేంద్రాల్లో అన్ని పరీక్షలు, చికిత్సలు, మందులు ఉచితం అని రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టిఎస్ సింగ్ డియో మంగళవారం రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. 2022-23 బడ్జెట్‌లో ఆరోగ్య శాఖకు గ్రాంట్‌ల డిమాండ్‌పై చర్చకు సమాధానమిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ లో ఈ ఏడాది చివరికల్లా ఎన్నికలు జరగనున్నాయి.

"జూన్ 1 నుండి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నగదు రహిత వ్యవస్థ అమలు చేయబడుతుంది. దీని ద్వారా రోగులు చికిత్స, పరీక్షలు, మందుల కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు" అని సింగ్ డియో చెప్పారు. అన్ని ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD), ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ (IPD) సేవలతో పాటు మందులు, రోగనిర్ధారణ సేవలు ఉచితంగా అందించబడతాయని పేర్కొన్నారు.

ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందించాలనే లక్ష్యంతో.. రాష్ట్రంలో అమలు చేస్తున్న “న్యాయ్” పథకాలకు కొత్త కోణాన్ని జోడించే ఈ పథకానికి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తన ఆమోదం తెలిపారని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకాన్ని ‘స్వస్త్య న్యాయ్ యోజన’ అని పిలుస్తామని టీఎస్‌ సింగ్ డియో కార్యాలయంలోని అధికారి తెలిపారని ప‌లు వార్తా సంస్థ‌లు నివేదించాయి.

యూనివర్సల్ హెల్త్‌కేర్‌లో మానవ వనరులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందున, ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్యను గత నాలుగేళ్లలో 179 నుండి 534 కి పెంచామని ఆరోగ్య మంత్రి సభకు తెలిపారు. నాలుగేళ్లలో మెడికల్ ఆఫీసర్ల సంఖ్య 1,302 నుంచి 2,413కి, దంతవైద్యుల సంఖ్య 67 నుంచి 222కి పెరిగిందని ఆయన చెప్పారు. 2017-18లో మూడు ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని, ఇప్పుడు 29 ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉందని సింగ్ డియో చెప్పారు.

రాష్ట్రంలోని 85 శాతం కుటుంబాలు `డాక్టర్ ఖుబ్‌చంద్ బాఘేల్ ఆరోగ్య సహాయ పథకం- ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన' ప్రయోజనాలను పొందుతున్నాయని, ఆయుష్మాన్ కార్డుల జారీలో ఛత్తీస్‌గఢ్ అగ్రగామిగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు తగ్గిందని మంత్రి తెలిపారు. చర్చ అనంతరం రూ.5,122.08 కోట్ల డిమాండ్ ప్రతిపాదన ఆమోదం పొందింది.



Next Story