భారత సైన్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం

రాజౌరి జిల్లాలోని సుందర్‌బని ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామంలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

By Medi Samrat  Published on  27 Feb 2025 7:03 PM IST
భారత సైన్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం

రాజౌరి జిల్లాలోని సుందర్‌బని ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామంలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బుధవారం నాడు జరిగిన ఈ కాల్పుల్లో భారత సైన్యంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆర్మీ గురువారం నాడు స్పష్టం చేసింది. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో భారత దళాలలో ప్రాణనష్టం జరిగినట్లు తప్పుడు వాదనలను ప్రచారం చేస్తున్నారని, ఇది ఉద్దేశపూర్వక తప్పుడు సమాచార ప్రచారమని భారత సైన్యం తెలిపింది. తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు పలు గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సైనికులు వెళ్తున్న వాహనంపై బుధవారం నాడు కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సుందర్‌బనీ ప్రాంతంలో దట్టమైన అడవిలో నక్కి ఉన్న ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అలర్ట్ అయిన సైనికులు వారిపై ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల ఘటనతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుంది.

Next Story