మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిని మట్టుబెట్టిన భారత సైన్యం

మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని దాచిగ్రామ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

By Medi Samrat  Published on  3 Dec 2024 1:51 PM GMT
మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిని మట్టుబెట్టిన భారత సైన్యం

మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని దాచిగ్రామ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. స్థానిక లష్కర్ కమాండర్ జునైద్ అహ్మద్ భట్‌గా అతడిని గుర్తించారు. గగాంగీర్, గందర్‌బల్‌లలో అమాయక ప్రజల హత్యలతో పాటు అనేక ఇతర ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడని కశ్మీర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం డచిగామ్‌లో టెర్రరిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాల చేతిలో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జునైద్‌ అహ్మద్‌ భట్‌ మృతిచెందినట్టు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

అక్టోబరు 20న గండర్‌బాల్‌లోని సొరంగం నిర్మాణ స్థలంలో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులను చంపిన దాడిలో భట్ కీలక పాత్ర పోషించాడు. ఈ దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత అతడికి సంబంధించిన ఒక CCTV విజువల్స్ బయటకు వచ్చాయి. భట్ సొరంగం ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బంది నివసించే కార్మికుల శిబిరంలోకి ప్రవేశించినట్లు చూపించింది. కుల్గాం నివాసి అయిన భట్, నలుపు రంగు దుస్తులు ధరించి, బూడిదరంగు శాలువాతో, రైఫిల్‌ను పట్టుకుని చిత్రంలో కనిపిస్తాడు.

Next Story