పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నం.. కాల్పుల్లో 11 మంది మృతి

సోమవారం మణిపూర్‌లో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 11 మందికి పైగా సాయుధ వ్యక్తులు మరణించినట్లు సమాచారం

By Medi Samrat  Published on  11 Nov 2024 7:45 PM IST
పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నం.. కాల్పుల్లో 11 మంది మృతి

సోమవారం మణిపూర్‌లో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 11 మందికి పైగా సాయుధ వ్యక్తులు మరణించినట్లు సమాచారం. పోలీసు స్టేషన్‌పై కొందరు వ్యక్తులు దాడికి యత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఒక సైనికుడు గాయపడినట్లు కూడా సమాచారం ఉందని వర్గాలు తెలిపాయి.

గతేడాది నుంచి మణిపూర్‌లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. మే 2023లో ఘ‌ర్ష‌న‌లు ప్రారంభమైనప్పటి నుండి కనీసం 250 మంది మరణించారు. దాదాపు 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌పై దుండగులు దాడి చేశారని రాష్ట్ర జిరిబామ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కృష్ణ కుమార్ తెలిపారు. కేంద్ర భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో 31 ఏళ్ల గిరిజన మహిళ సజీవదహనమైన ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని తెలిపారు.

Next Story