బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ గురువారమే తేజస్వీ నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజస్వీ సోదరి రోహిణీ ఆచార్య ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఢిల్లీలో జరగనుందని అంటున్నారు. నిశ్చితార్థం సందర్భంగా తేజస్వీ కుటుంబం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, సోదరుడు తేజ్ ప్రతాప్‌తో తేజస్వీ ఢిల్లీలోనే ఉన్నారని, ఈ నిశ్చితార్థ కార్యక్రమం అతి కొద్ది మంది సమక్షంలో జరగనున్నట్లు సమాచారం.
తేజస్వీకి ఇద్దరు సోదరుడు, ఏడుగురు సోదరిణులు. అయితే వీరందరిలో లాలూ రాజకీయ వారసత్వం తేజస్వీకి మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో బీహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తేజస్వీకి ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. రాఘోపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2015 నుంచి 2017 వరకు బీహార్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.