జిమ్‌లో వర్కౌట్ చేస్తూ 19 ఏళ్ల ఎంబీబీఎస్ స్టూడెంట్ గుండెపోటుతో మృతి

జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు

By Medi Samrat  Published on  22 Aug 2024 12:30 PM GMT
జిమ్‌లో వర్కౌట్ చేస్తూ 19 ఏళ్ల ఎంబీబీఎస్ స్టూడెంట్ గుండెపోటుతో మృతి

జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి కిషన్ మానెక్ వ్యాయామ సమయంలో కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. అక్కడ వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించారు. మానెక్ PGVCLలో డిప్యూటీ ఇంజనీర్ అయిన హేమంత్ మానెక్ కుమారుడు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో కిషన్ గుండెపోటుతో అకస్మాత్తుగా నేలపై పడిపోవడాన్ని చూడొచ్చు. ఎంపీ షా మెడికల్ కాలేజీకి చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి కిషన్ యాక్టివ్ గా ఉండేవాడు.

చిన్న వయసులోనే గుండె పోటు వస్తూ ఉండడం ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది. శనివారం రాత్రి చెన్నై లోని ఓ పబ్‌లో 22 ఏళ్ల ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థి కుప్పకూలి మృతి చెందాడు. మృతుడిని రామాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థి మహ్మద్ సుహైల్‌గా గుర్తించారు పోలీసులు. అతను, ముగ్గురు అమ్మాయిలు ఒక్కొక్కరికి ₹ 1,000 ఎంట్రీ ఫీజు చెల్లించి రాత్రి 9 గంటలకు పబ్‌కు వచ్చాడు. డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు. అతను తింటూ తన స్నేహితులతో కబుర్లు చెబుతుండగా.. అకస్మాత్తుగా విపరీతంగా చెమటలు పట్టడం ప్రారంభించాయి. క్షణాలలో అతను నేలపై కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సుహైల్ స్నేహితులు, పబ్‌లోని సిబ్బంది అతన్ని ప్రభుత్వ కిల్‌పాక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (కెఎమ్‌సిహెచ్)కి తరలించారు, వైద్యులు అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు.

Next Story