ఎవరీ చిత్ర రామకృష్ణ.. అదో విచిత్ర గాధ..
Tax Searches On Ex-NSE Head Accused Of Sharing Info With Himalayan Yogi. నేషనల్ స్టాక్ ఎక్చేంజి (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ నివాసంపై
By Medi Samrat Published on 17 Feb 2022 1:56 PM GMTనేషనల్ స్టాక్ ఎక్చేంజి (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేత వంటి కారణాలతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. చిత్రా రామకృష్ణ, హిమాలయ యోగితో రహస్య సమాచారాన్ని పంచుకున్నారని కీలక నిర్ణయాలపై అతని సలహా తీసుకున్నారని ఆరోపిస్తూ, ఆదాయపు పన్ను శాఖ ఈ రోజు సోదాలు చేసింది. చిత్రా రామకృష్ణ 2013 మరియు 2016 మధ్య నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మేనేజింగ్ డైరెక్టర్, CEO గా ఉన్నారు. ఆమె "వ్యక్తిగత కారణాల" కారణంగా ఆ పదవి నుండి నిష్క్రమించారు. చిత్రా రామకృష్ణ 2009లో నేషనల్ స్టాక్ ఎక్చేంజీలో జేఎండీగా నియమితులయ్యారు. 2013లో స్టాక్ ఎక్చేంజీకి సీఈవో అయ్యారు. అనూహ్యరీతిలో 2016లో పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
NSEకి సీఈవోగా ఉంటూ ఏ పని చేయాలన్నా హిమాలయాల్లో ఉంటున్న ఓ యోగి చెబితేనే చిత్రా ముందడుగు వేసిందనే ప్రచారం సాగుతోంది. NSEలో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలతో పాటు.. NSE డివిడెంట్, ఆర్థిక ఫలితాల వివరాలు, ఫైనాన్షియల్ డేటా మొత్తం ఆ గుర్తు తెలియని యోగి డైరెక్షన్‌లోనే జరిగాయని అంటున్నారు. అంతేకాకుండా ఆ యోగిని చిత్రా ఎప్పుడు కలవలేదని.. మెయిల్ రూపంలోనే వారి మధ్య సంభాషణలు కొనసాగాయని చెబుతున్నారు. చిత్రా ప్రశ్నలు అడగడం.. దానికి యోగి సమాధానాలు చెప్పడం.. ఇలా ముందుకు సాగింది అప్పట్లో..! చిత్రా రామకృష్ణ పదవీకాలంలో కొన్ని నియామకాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.
స్టాక్ ఎక్చేంజి చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ గా ఆనంద్ సుబ్రమణియన్ ను నియమించడం, ఆపై అతడిని గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా మార్చడం వివాదాస్పదం అయ్యాయి. దీనిపై సెబీ విచారణ చేపట్టింది. ఎంతో కీలక, రహస్య సమాచారాన్ని సైతం చిత్రా రామకృష్ణ ఆ హిమాలయ యోగితో పంచుకున్నట్టు సెబీ వెల్లడించింది. చిత్రా రామకృష్ణ అతిక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారించిన సెబీ ఆమెకు రూ.3 కోట్ల భారీ జరిమానా విధించడమే కాకుండా మూడేళ్ల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించింది. చిత్రా రామకృష్ణ స్పందిస్తూ.. ఆ హిమాలయ యోగి తనకు గత రెండు దశాబ్దాలుగా మార్గదర్శనం చేస్తున్నారని, వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాల్లో దారి చూపించారని తెలిపారు.