మేకిన్ ఇండియా మిలిటరీ విమానాలు వచ్చేస్తున్నాయి

Tata Airbus sign rs20,000 crore deal for military aircraft. రక్షణ రంగంలో భారత్ మేకిన్ ఇండియా దిశగా అడుగులు వేస్తూ వెళుతోంది.

By Medi Samrat  Published on  24 Sept 2021 7:06 PM IST
మేకిన్ ఇండియా మిలిటరీ విమానాలు వచ్చేస్తున్నాయి

రక్షణ రంగంలో భారత్ మేకిన్ ఇండియా దిశగా అడుగులు వేస్తూ వెళుతోంది. ఇప్పటికే పలు క్షిపణులు, ఆయుధాల విషయంలో భారత ప్రభుత్వం మేడిన్ ఇండియా వైపే చూస్తోంది. తాజాగా కూడా ర‌క్ష‌ణ శాఖ 56 సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బ‌స్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.20 వేల కోట్లని తెలిపింది. ఇందులో భాగంగా 16 ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను 48 నెల‌ల్లో ఎగ‌ర‌డానికి సిద్ధంగా ఉన్న కండిష‌న్‌లో ఎయిర్‌బ‌స్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఇస్తుంది. ఇక మిగ‌తా 40 విమానాల‌ను ఇండియాలోనే టాటా అడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్స్ లిమిటెడ్‌తో క‌లిసి ఎయిర్‌బ‌స్ డిఫెన్స్ అండ్ స్పేస్ త‌యారు చేయనుంది.

ఈ సీ-295 ఎండబ్ల్యూ ఎయిర్‌క్రాఫ్ట్ సామ‌ర్థ్యం 5-10 ట‌న్నులు. దీనిని ర‌వాణా కోసం ఉప‌యోగిస్తారు. ప్ర‌స్తుతం ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న ఏవీఆర్‌వో-748ల స్థానంలో వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ ఇండియాలో మిలిట‌రీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను త‌యారు చేసే తొలి ప్రాజెక్ట్ ఇదే కావ‌డం విశేషం. ఇక మేకిన్ ఇండియాకు ఊతమిస్తూ రక్షణ శాఖ ఇంతకు ముందే కీలక నిర్ణయం తీసుకుంది. 118 అర్జున్ ఎమ్‌కే 1ఏ ప్రధాన యుద్ధ ట్యాంకులను తయారు చేయాలంటూ తమిళనాడు అవడిలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్‌ ఇచ్చారు. దీని కోసం 7,523 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ వివరాలను రక్షణ శాఖ అధికార ప్రతినిధి భారత్ భూషణ్ తెలిపారు.


Next Story