కాంగ్రెస్ సీనియర్ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్యం విషమించింది. కరోనా అనంతరం ఆరోగ్య సమస్యలతో ఆయన గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఈనెల 2 నుంచి చికిత్స పొందుతున్నారు. గొగోయ్‌కి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిస్వ శర్మ శనివారం వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, కీలక అవయవ వ్యవస్థలు వైఫల్యం చెందాయని తెలిపారు. ఆగస్ట్ 25న∙గొగోయ్‌కి కోవిడ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలావుంటే.. ఆరుసార్లు లోక్ సభకు ఎన్నికైన గొగోయ్.. అస్సాం రాష్ట్రానికి అత్యధిక కాలం సేవలందించిన సీఎంగా రికార్డులలోకి ఎక్కారు. గొగోయ్ తనయుడు గౌరవ్ గొగోయ్ ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.