హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్..తమిళనాడులో ఘటన

హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

By Knakam Karthik  Published on  6 Feb 2025 7:46 AM IST
Crime, National News, Tamilnadu, School Student GangRaped By 3 Teachers

హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్..తమిళనాడులో ఘటన

హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాల విద్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు సాముహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ విద్యార్థిని నెల రోజులకు పైగా నుంచి పాఠశాలకు హాజరుకావడం లేదని పాఠశాల ప్రిన్సిపాల్ విచారణ చేపట్టారు. దీంతో కుటుంబ సభ్యులను విచారించగా తన కూతురిపై జరిగిన అఘాయిత్యంపై ఆ తల్లి ప్రిన్సిపాల్‌కు తెలిపింది. కాగా స్పందించిన ప్రిన్సిపాల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ విషయాన్ని జిల్లా బాలల రక్షణ అధికారికి తెలియజేయాలని ఆమెకు సూచించారు.

విద్యార్థిని తల్లి ఫిర్యాదుతో కృష్ణగిరి పోలీసులు ముగ్గురు నిందితులైన ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన తర్వాత ముగ్గురుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అత్యాచార ఘటనలో ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు నిరసన తెలిపారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story