ప్ర‌ధాని మోదీ రోడ్‌షోకు అనుమతి నిరాకరించిన పోలీసులు

తమిళనాడులోని కోయంబత్తూరులో మార్చి 18న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోకు తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించారు.

By Medi Samrat  Published on  15 March 2024 5:31 PM IST
ప్ర‌ధాని మోదీ రోడ్‌షోకు అనుమతి నిరాకరించిన పోలీసులు

తమిళనాడులోని కోయంబత్తూరులో మార్చి 18న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోకు తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కోయంబత్తూరులో జరగాల్సిన రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని పోలీసులు వివరించారు. కోయంబత్తూరు పట్టణంలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించేందుకు బీజేపీ పోలీసులను అనుమతి కోరింది. 1998లో బాంబు పేలుడు జరిగిన ఆర్‌ఎస్ పురంలో రోడ్‌షోను ముగించాలని నిర్ణయించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాక‌రించారు.

దీంతో అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయనుంది. రోడ్డు షో ప్రభావం పరీక్షలకు హాజరయ్యే పిల్లలపై పడుతుందని పోలీసులు వివరించారు. భద్రతకు ముప్పు ఉందని పోలీసులు కోర్టుకు కూడా తెలియజేశారు. భద్రతకు ముప్పు ఉంటే ఎస్పీజీ అనుమతి ఇస్తారా అని కోర్టు ప్రశ్నించింది. తమ అనుమతి కూడా అవసరమని పోలీసులు సమాధానం ఇచ్చింది.

Next Story