సాగు చట్టాల రద్దుకు అసెంబ్లీ తీర్మానం..

Tamil Nadu assembly passes resolution against 3 farm laws. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమిళనాడు

By అంజి  Published on  29 Aug 2021 3:45 AM GMT
సాగు చట్టాల రద్దుకు అసెంబ్లీ తీర్మానం..

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

తీర్మానం ప్రవేశపెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్

తీర్మానాన్ని వ్యతిరేకించిన అన్నాడీఎంకే, బీజేపీ

సభ నుండి అన్నాడీఎంకే, బీజేపీ వాకౌట్

చెన్నై: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమిళనాడు సీఎం స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. దీంతో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్న ఏడో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అయితే ఈ తీర్మానాన్ని అన్నాడీఎంకే, బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. అఖిలపక్ష సమావేశం లేకుండా, చర్చ జరపకుండా తొందరపాటుతో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. శనివారం నాడు సభ ప్రారంభమైన వెంటనే సీఎం స్టాలిన్ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

కాగా నూతన సాగు చట్టాల వ్యతిరేక తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఇలాంటి చట్టాలపై ఎలాంటి తీర్మానం చేయలేదని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. అన్నాడీఎంకే, బీజేపీ సభ్యులు మాత్రం సభ నుండి వాకౌట్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని సీఎం స్టాలిన్ అన్నారు. వ్యవసాయ చట్టాలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు అటు రైతులను ఇటు వ్యవసాయాన్ని ఆదుకోవడంలో విఫలమయ్యాని సీఎం అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు ఏమాత్రం ఉపయోగపడే చట్టాలు కావని, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చారని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.


Next Story