నేడు భారత్ - పాక్ మధ్య చర్చలు.. ఏం జరగనుంది?
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. డీజీఎంవోల (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి.
By అంజి
నేడు భారత్ - పాక్ చర్చలు.. ఏం జరగనుంది?
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. డీజీఎంవోల (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరిగే ఈ చర్చల్లో కాల్పుల విరమణతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. సీజ్‌ఫైర్‌ను కొనసాగించడంతో పాటు సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తారని సమాచారం. కాగా ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నాం మధ్యాహ్నం 12 గంటలకు భారత్, పాక్ డైరెక్టర్ జనరల్స్ (మిలటరీ ఆపరేషన్స్) చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణ మేరకే చర్చలు పరిమితం కానున్నట్టు సమాచారం.
కాగా ప్రస్తుతం భారత్ - పాక్ సరిహద్దుల్లో ప్రశాంతం, నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి పాక్ వైపు నుంచి లేని ఏలాంటి కవ్వింపు చర్యలు, కాల్పులు జరగలేదు. రెండు దేశాల మధ్య జరిగే చర్చల్లో కొన్ని నిర్ధిష్టమైన ప్రతిపాదనలు భారత్ చేయనుందని తెలుస్తోంది. నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ సమావేశంలో పలు ప్రతిపాదనలు ఖరారు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరుడుగట్టిన తీవ్రవాది “జైషే మహమ్మద్” ఛీఫ్ మసూద్ అజార్ ను భారత్ కు అప్పగింత ప్రధానమైన డిమాండ్‌గా ఉండనుందని తెలుస్తోంది.
అలాగే సరిహద్దు వద్ద మోహరించిన పాక్ సైనిక బలగాలు తక్షణమే ఉపసంహరణ, తీవ్రవాద కార్యకలాపాలు, ప్రోత్సాహాన్ని పాక్ తక్షణమే విరమించుకోవాలి. కాల్పుల విరమణ అవగాహన పై పాక్ చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలన్న అంశాలు ప్రధానంగా చర్చల్లోకి వచ్చే అవకాశం ఉంది. తదుపరి దశలో సింధు జలాల ఒప్పందం రద్దు, వీసాల రద్దు, వ్యాపార సంబంధాలు పునరుద్దరణ, సరిహద్దు రహదారుల అనుమతులు పై చర్చలు జరిగే అవకాశం ఉంది.