ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ ఓపెన్
Taj Mahal and other centrally-protected monuments, museums to reopen on June 16. లాక్ డౌన్ కారణంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ
By Medi Samrat Published on 14 Jun 2021 5:54 PM IST
లాక్ డౌన్ కారణంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ మూసి వేసిన సంగతి తెలిసిందే..! ఇటీవలి కాలంలో కరోనా ఉధృతి తగ్గుతూ ఉండడంతో ప్రముఖ పర్యాటక ప్రదేశాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. COVID-19 మహమ్మారి కారణంగా రెండు నెలల పాటు మూసివేయబడిన తాజ్ మహల్, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మ్యూజియంలు, అన్ని స్మారక చిహ్నాలు జూన్ 16 న నుండి తిరిగి తెరవాలని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్‌ఐ) ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో భారతదేశం అంతటా 3,693 స్మారక చిహ్నాలు మరియు 50 మ్యూజియంలు ఉన్నాయి. సందర్శకులు ఎంట్రీ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోగలరని ఎఎస్‌ఐ అధికారి తెలిపారు. ఆఫ్‌లైన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదని తెలిపారు.
కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది మార్చి నెలలో స్మారక చిహ్నాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మూసివేసింది. అప్పుడు 188 రోజుల తర్వాత సెప్టెంబర్ 21న పర్యాటకుల కోసం తెరిచారు. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారీగా కేసులు పెరగడంతో గత ఏప్రిల్ 16 నుంచి దేశవ్యాప్తంగా స్మారక చిహ్నాలను వీక్షించేందుకు సందర్శకులకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి నిలిపి వేసింది. సుమారు రెండు నెలల తర్వాత మళ్లీ పర్యాటకులకు అనుమతి ఇచ్చింది.
అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లను సడలిస్తూ ఉండడంతో జూన్ 16 నుంచి కేంద్ర సంరక్షణలో ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను తిరిగి తెరవాలని నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సందర్శకులు ఆయా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. సందర్శకులను నియంత్రించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, ఇతర స్మారక చిహ్నాలు, ప్రాంతాలు, మ్యూజియంలను బుధవారం నుండి తిరిగి ప్రారంభిస్తామని సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, ఆగ్రా సర్కిల్ ఎఎస్ఐ, డాక్టర్ వసంత కుమార్ స్వరంకర్ తెలిపారు. సందర్శకులు సామాజిక దూరాన్ని పాటించేలా చూస్తామని.. అలాగే రోజులో మూడుసార్లు శానిటైజేషన్ నిర్వహిస్తామని తెలిపారు. శరీర ఉష్ణోగ్రతలను ద్వారా తనిఖీ చేస్తామని తెలిపారు. పర్యాటకులు తాజ్ మహల్, ఇతర స్మారక చిహ్నాల ప్రాంతాల్లో ఏదైనా వస్తువును తాకడానికి అనుమతించరని తేల్చి చెప్పారు.