ఇరుకైన వీధిలో గొడవ.. కారు డ్రైవర్ కోపంతో..

SUV, After Argument With Biker, Runs Over 3 In Narrow Delhi Lane. ఇరుకైన వీధిలో బైకర్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత కోపంతో ఉన్న కారు డ్రైవర్,

By Medi Samrat  Published on  29 Oct 2022 8:15 PM IST
ఇరుకైన వీధిలో గొడవ.. కారు డ్రైవర్ కోపంతో..

ఇరుకైన వీధిలో బైకర్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత కోపంతో ఉన్న కారు డ్రైవర్, ఆ ప్రాంతం నుండి వేగంగా వెళ్ళిపోతూ నడుచుకుంటూ వెళుతున్న వారిని గాయపరిచాడు. కొంతమంది వ్యక్తుల మీదకు తన SUVతో దూసుకెళ్లడంతో.. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ భవనంలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా కారు డ్రైవర్‌ను గుర్తించి అరెస్టు చేశారు.

అక్టోబరు 26న ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో ఇరుకైన సందు గుండా వెళుతుండగా కారు డ్రైవర్ మోటార్‌సైకిల్‌ పై వెళుతున్న వ్యక్తితో గొడవపడ్డాడు. ఈ ఘటన తర్వాత స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు, అయితే ఆగ్రహించిన కారు డ్రైవర్ యాక్సిలరేటర్‌ను నొక్కి, అక్కడ గుమిగూడిన ప్రజలపైకి కారుతో దూసుకెళ్లాడు. వాహనం నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.



Next Story