Video : ఆర్‌జి కర్ ఆసుప‌త్రి సమీపంలో అనుమానాస్పద బ్యాగ్.. అల‌ర్టైన అధికారులు

కోల్‌కతాలోని ఆర్‌జి కార్ కాలేజీ అండ్ హాస్పిటల్ సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ కనుగొనబడింది

By Medi Samrat
Published on : 12 Sept 2024 3:39 PM IST

Video : ఆర్‌జి కర్ ఆసుప‌త్రి సమీపంలో అనుమానాస్పద బ్యాగ్.. అల‌ర్టైన అధికారులు

కోల్‌కతాలోని ఆర్‌జి కార్ కాలేజీ అండ్ హాస్పిటల్ సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ కనుగొనబడింది. ట్రైనీ డాక్టర్ల హత్యపై వైద్యులు నిరసన తెలుపుతున్న చోటే ఈ అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది. డాగ్ స్క్వాడ్ బృందం నిరసన స్థలానికి చేరుకుంది. బాంబు నిర్వీర్య దళం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఆందోళనకారుల నిరసన వేదిక దగ్గర ఈ అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది.

ఈ బ్యాగ్ ను అక్కడ ఎవరు ఉంచారనే విష‌య‌మై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బ్యాగ్ లోపల ఏముందనే విష‌య‌మై త‌నిఖీ చేస్తున్నారు. ఆగస్టు 9వ తేదీ అర్ధరాత్రి ఇదే ఆసుప‌త్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు గురైన విష‌యం తెలిసందే. వైద్యుల భద్రత కోరుతూనే.. మృతి చెందిన ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేప‌ట్టారు.

Next Story