రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హ‌త్య‌ : 28 రోజుల్లోనే మరణశిక్ష విధిస్తూ తీర్పు

Surat toddler’s rape and murder Accused convicted in 21 day. రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను

By Medi Samrat  Published on  7 Dec 2021 1:43 PM GMT
రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హ‌త్య‌ : 28 రోజుల్లోనే మరణశిక్ష విధిస్తూ తీర్పు

రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను గుజరాత్‌లోని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది. అత్యాచార ఘటన అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై 7 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో 246 పేజీల చార్ట్ షీట్‌ను పోలీసులు కోర్టులో సమర్పించారు. కోర్టు కేవలం 28 రోజుల్లో తీర్పు ఇచ్చింది. సూరత్‌లోని పండేసర తహసీల్‌లోని ఒక గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారిని అదే ప్రాంతానికి చెందిన గుడ్డు యాదవ్ అనే వ్యక్తి దీపావళి రోజు రాత్రి ఇంటి బయట ఆడుకుంటుండగా తీసుకెళ్లాడు. చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక నోరు నొక్కి హత్య చేశాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత, బాలిక మృతదేహాన్ని పొదల్లోంచి వెలికితీశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై 7 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో 246 పేజీల చార్ట్ షీట్‌ను పోలీసులు కోర్టులో సమర్పించారు. కోర్టు కేవలం 28 రోజుల్లో తీర్పు ఇచ్చింది. కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. త్వరితగతిన న్యాయం జరిగేలా చూసేందుకు, సూరత్‌లోని పాండేసర పోలీసులు నవంబర్ 8న నిందితుడిని అరెస్టు చేసిన ఏడు రోజుల్లో చార్జ్ షీట్‌ను సమర్పించారు. కోర్టు 43 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది మరియు ఒక నెలలోపే తీర్పు వచ్చింది. సోమవారం విచారణ చివరి రోజున, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నయన్ సుఖద్వాలా దోషికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిందితుడు బీహార్‌కు చెందినవాడు. భార్య మరియు ఇద్దరు పిల్లలతో సూరత్ నగరంలోని పండేసర ప్రాంతంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.


Next Story